రాయచోటి ముచ్చట్లు:
రాయచోటిలో డీఎస్సీ–2025 అక్రమాలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ ర్యాలీ నిర్వహించనున్నారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేయనున్నారు.
ఎన్నికల హామీ మేరకు ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి అమలు చేయాలని కోరనున్నారు.
రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ శాంతియుత ర్యాలీ నిర్వహించనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, గడికోట రమేష్ కుమార్‌రెడ్డి ఆధ్వర్యంలో ఆగస్టు 10న ఉదయం 9 గంటలకు వైసీపీ పార్టీ కార్యాలయం నుంచి బంగ్లా వరకు ర్యాలీ జరగనుందన్నారు.
Tags:Constituency level rally on August 10 in Rayachoti