రాయచోటి ముచ్చట్లు:
రాయచోటి మండల పరిధిలోని గరుగుపల్లి గ్రామ శివారులో చట్టవ్యతిరేకంగా పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు ఆకస్మిక దాడి చేశారు. గ్రామం శివారులో కొందరు రహస్యంగా పేకాట ఆడుతున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, గుట్టుచప్పుడు కాకుండా ఆడుతున్న వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.పట్టుబడిన వారి వద్ద నుంచి రూ. 7,100 నగదుతో పాటు 52 పేక ముక్కలను పోలీసులు సీజ్ చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు అర్బన్ ఎస్ ఐ జహీర్ పేర్కొన్నారు.గ్రామాల్లో ఎవరైనా పేకాట, మట్కా వంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా పోలీసులు హెచ్చరించారు
Tags: Police raid gambling den on the outskirts of Garugupalli; cash seized.