August 8, 2026
Explore
గాలివీడులో జూద స్థావరంపై పోలీసుల దాడి

గాలివీడులో జూద స్థావరంపై పోలీసుల దాడి

August 8, 2026 | Andhra Pradesh

గాలివీడు ముచ్చట్లు:

గాలివీడుమండలంలోని దానం రెడ్డిగారిపల్లి గ్రామానికి దక్షిణంగా 200 మీటర్ల దూరంలోని చీకి చెట్ల వద్ద జూద స్థావరంపై పోలీసులు దాడి చేశారు.
శనివారం సాయంత్రం 4 గంటల సమయంలో డబ్బులు పణంగా పెట్టి మంగతాయ్ జూదం ఆడుతున్న ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.40,300 నగదు, ఆరు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఐదు మోటార్‌సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags: Police raid gambling den in Galiveedu