పుంగనూరుముచ్చట్లు:
పట్టణంలోని నగరివీధిలో జమీందారులు నిర్మించిన శ్రీమాణిక్యవరదరాజస్వామి నూతన రాజగోపురము, కలశప్రతిష్ఠాపన ప్రారంభోత్సవ కార్యక్రమం ఈనెల 14న నిర్వహిస్తున్నట్లు ఉప కమిషనర్ ఏకాంబరం తెలిపారు. గురువారం ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. 14 నుంచి 17 వతేదీ వరకు నాలుగురోజుల పాటు ఆలయంలో విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ పూజా కార్యక్రమాలు ఆగమశాస్త్రం ప్రకారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భక్తులు పాల్గొని, స్వామివారి కృపకుపాత్రులుకావాలెనని కోరారు.
Tags: Consecration of the Kalasha for Sri Manikyavaradaraja Swamy on the 14th.