పోరాటం ఆగదు
- మాజీ మంత్రి పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి
పుంగనూరుముచ్చట్లు:
వైఎస్సార్‌సిపి అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు డిఎస్సీ అక్రమాలపై గురువారం తొలిరోజు దీక్షలకు అపూర్వ స్పందన లభించింది. రాష్ట్ర రీజనల్ కోఆర్డినేటర్, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వయంగా దీక్షల్లో పాల్గొని క్యాడర్‌కు ఊపునిచ్చారు. పట్టణంలోని ముడియప్ప సర్కిల్ వరకు పెద్దిరెడ్డి ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సిపి రిలేదీక్షలను అక్కడే పెద్దిరెడ్డి ప్రారంభించి, దీక్షల్లో పాల్గొన్న వారికి పూలమాలలు, పార్టీ కండువాలు కప్పి దీక్షల్లో బైఠాయించారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ మూడు రోజుల పాటు జరిగే దీక్షలలో ప్రతి ఒక్కరు పాల్గొని , డిఎస్సీలో అక్రమాలపై పోరాటానికి సిద్ధం కావాలన్నారు. అక్రమాలపై నిగ్గుతేల్చేదాక వైఎస్సార్‌సిపి పోరాటం ఆగదని ఆయన హెచ్చరించారు. ఈనెల 10న నియోజకవర్గస్థాయి ర్యాలీలో వేలాది మంది పాల్గొని, డిఎస్సీ అక్రమాలపై ప్రభుత్వానికి హెచ్చరికలు పంపాలని కోరారు. ఈ దీక్షల్లో ముస్లిం మైనార్టీ నాయకులు , విద్యార్థివిభాగం నాయకులు, యువజనసంఘం నాయకులు, పార్టీ నాయకులు దీక్షల్లో పాల్గొనడం గమనార్హం. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపి రెడ్డెప్ప, ఎంపిపి భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ పరిశీలకుడు జింకా వెంకటాచలపతి, జెడ్పిటిసి సోమశేఖర్‌రెడ్డి, రాష్ట్ర విద్యార్థి విభాగం కార్యదర్శి హేమంత్‌రెడ్డి, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, ఉమ్మడి జిల్లాల ఐటివింగ్ ఇన్‌చార్జ్ ప్రకాష్‌రెడ్డి, జిల్లా యూత్‌వింగ్ కన్వీనర్ కొత్తపల్లె చెంగారెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కళ్యాణ్ భరత్, పార్లమెంటు నియోజకవర్గ అధికార ప్రతినిదులు రాజశేఖర్‌రెడ్డి, పట్టణ పార్టీ కన్వీనర్ ఇర్ఫాన్, మాజీ కౌన్సిలర్లు పూలత్యాగరాజు, కిజర్‌ఖాన్, ఇంతియాజ్, గౌస్, లక్ష్మణరాజు, మహబూబ్‌బాషా, నయాజ్, రేష్మ, సాజిదాబేగం, కాళిదాసు, జెపి.యాదవ్, యువజన సంఘం నాయకులు కొండవీటి నరేష్, సిద్ధిక్, హేము, రాజేష్ , జిమ్ ఇర్ఫాన్, అస్లాంమురాధి, మమ్ము, రాఘవరెడ్డి, ఆర్‌కె.రామకృష్ణ, నంజుండప్ప, ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు.




Tags; Overwhelming response to YSRCP’s protests against DSC irregularities.