ఢిల్లీ ముచ్చట్లు:
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి అరకు ఎంపీ డా. గుమ్మ తనూజ రాణి గారు, వైయస్ఆర్ సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గారు, మేడా రఘునాథ్ రెడ్డి గారు, గొల్ల బాబూరావు గారు, లోక్‌సభ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి గారు, వైయస్ అవినాష్ రెడ్డి గారు, మద్దిల గురుమూర్తి గారు వినతి
గిరిజనుల విద్య, ఉద్యోగ, ఉపాధి హక్కులకు భంగం కలగకుండా జీవో నెం.3 స్థానంలో ప్రత్యామ్నాయ చట్టబద్ధ వ్యవస్థను అమలు చేయడంతో పాటు చట్ట సవరణలు చేపట్టాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి వైయస్ఆర్ సీపీ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు గురువారం కలిసి కోరారు. ఈ మేరకు ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
అరకు ఎంపీ డా. గుమ్మ తనూజరాణి గారు మాట్లాడుతూ..జీవో నెం.3, 1/70 చట్టానికి సంబంధించిన అంశాలను, గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం సమగ్రంగా పరిశీలించి గిరిజనులకు న్యాయం జరిగేలా చట్టబద్ధ పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. గిరిజనుల రాజ్యాంగబద్ధ హక్కుల పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Tags; A legal solution must be provided for the protection of tribal rights and laws.