కె.వి.పల్లి ముచ్చట్లు:
కె.వి.పల్లి మండలం కురువపల్లిలో ఓ యువతి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ నెల 21న వివాహం జరగాల్సి ఉండగా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకునేందుకు ప్రయత్నించింది. అప్రమత్తమైన తల్లి వెంటనే కాపాడడంతో ప్రాణాపాయం తప్పింది. అనంతరం 108 అంబులెన్స్‌లో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Tags: Young woman attempts suicide 16 days before wedding