తంబళ్లపల్లె ముచ్చట్లు:
గ్యాస్ సిలిండర్ పేలి అక్కా తమ్ముడు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలంలో గురువారం ఉదయం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని గోపిదిన్నె కు చెందిన అక్క తమ్ముడు ప్రకాష్, పవిత్ర ల వంట గదిలో ఉన్న గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి అక్క తమ్ముడు మంటల్లో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డారు. వారిని కాపాడేందుకు యత్నించిన మరో ఇద్దరు సైతం గాయపడడంతో క్షతగాత్రులను చికిత్స కోసం వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకువచ్చి, ప్రథమ చికిత్స అనంతరం ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్ల సలహా మేరకు తిరుపతి రుయాకు తరలించారు.
Tags:Sister and brother sustain severe injuries in gas cylinder explosion.