రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట మండలం తాళ్లపాక గ్రామంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్‌చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. “డబ్బా పాలు వద్దు.. తల్లిపాలే ముద్దు” అనే నినాదంతో ప్రతి తల్లి బిడ్డకు తల్లిపాలు అందించాలని పిలుపునిచ్చారు. పుట్టిన గంటలోపు ముర్రుపాలు తాగించడం వల్ల శిశువుల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అంగన్‌వాడీ సమస్యలను తెలుసుకుని, పిచ్చి మొక్కలు తొలగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించి, అంగన్‌వాడీ వసతులపై తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు.
Tags: Breast milk is the best food for infants: Chamarthi