August 5, 2026
Explore
అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ మైనారిటీ జనరల్ సెక్రటరీగా ఇర్ఫాన్

అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ మైనారిటీ జనరల్ సెక్రటరీగా ఇర్ఫాన్

August 5, 2026 | Andhra Pradesh

పీలేరు ముచ్చట్లు:

పీలేరుకు చెందిన షేక్ మహమ్మద్ ఇర్ఫాన్‌ను అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ మైనారిటీ జనరల్ సెక్రటరీగా నియమించారు. రాయచోటిలో జరిగిన కార్యక్రమంలో APCC డెలిగేట్ ఎస్.ఎం.డి. గౌస్, DCC మైనారిటీ చైర్మన్ ఎన్. సయ్యద్ అలీ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఇర్ఫాన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ రాష్ట్ర, జాతీయ నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Tags: Irfan appointed as Annamayya District Congress Minority General Secretary.