March 7, 2026
Explore
మహిళా దినోత్సవ వేడుకలు

మహిళా దినోత్సవ వేడుకలు

March 7, 2026 | Andhra Pradesh

పుంగనూరు ముచ్చట్లు:

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా ఉపాధ్యాయుల సేవలు కొనియాడి శనివారం సాయంత్రం వారిని సత్కరించారు. ఎంఈవోలు నటరాజారెడ్డి , రెడ్డెన్నశెట్టి , ఎస్టీయు ప్రతినిధులు పోకల మధుసూదన్‌, మోహన్‌ ఆధ్వర్యంలో మహిళా ఉపాధ్యాయులు సమ దుస్తులు ధరించి వేడుకల్లో పాల్గొన్నారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరిపారు. ఎంఈవో నటరాజారెడ్డి మాట్లాడుతూ సమాజాభివృద్ధికి మహిళలు , ఉపాధ్యాయులు ఎంతో అవసరమని కొనియాడారు. మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిభాయిపూలేని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకుని పని చేయాలని సూచించారు. అలాగే మహిళలపైన జరుగుతున్న దాడులను అణచివేయుటకు చట్టాలు ఇంకా కఠినతరం చేయాలని , సమాజంలో ఎదురయ్యే సమస్యలను ప్రతిఘటించే స్థాయికి మహిళలు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు సరస్వతి, రాజకుమారి, ఉపాధ్యాయులు హరికిషోర్‌రెడ్డి, బుడ్డన్న, మంజునాథ్‌, వెంకటప్ప, శ్రీరాములురెడ్డి, శ్రీనివాసులు, ప్రసాద్‌బాబు, వెంకట్రమణ, తులసిదాస్‌, దేవకుమార్‌, శివకుమార్‌, దీపారాణి, విజయశ్రీ, షబీనభాను, మాధవి, సురేఖ, షహీన, హేమలత, అరుణకుమారి, పద్మజ, రేవతి, నాగమంజరి, గాయిత్రి, నిర్మల, నాగేశ్వరమ్మ, పార్వతమ్మ, శ్యామలత తదితరులు పాల్గొన్నారు.

Tgas: Women’s Day celebrations