అమెరికా ముచ్చట్లు:
అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో చెలరేగిన భారీ కార్చిచ్చు (వైల్డ్ ఫైర్) తీవ్ర కలకలం రేపింది. స్పోకన్ నగర పరిసరాల్లో మంటలు వేగంగా వ్యాపించి సుమారు 700 ఇళ్లు దగ్ధమయ్యాయి. ప్రమాదం తీవ్రత దృష్ట్యా దాదాపు 60 వేల మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ఘటనలో ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదని అధికారులు తెలిపారు. పొడి గాలుల కారణంగా మంటలు వేగంగా విస్తరించాయని వెల్లడించారు. కార్చిచ్చుకు కారణమై ఉండొచ్చనే అనుమానంతో ఓ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags: Wildfire shakes Washington… 700 homes gutted…!