సుండుపల్లి ముచ్చట్లు:
సుండుపల్లి మండలం ముడుంపాడు గ్రామపంచాయతీ పరిధిలో “రెండేళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ప్రజల విశ్వాసంతోనే కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు భారీగా పాల్గొన్నారు.
Tags: TDP reaches every doorstep with the ‘Two Years of Trust’ campaign: Sugavasi