August 1, 2026
Explore
బస్సు చోరీ కేసులో.. కానిస్టేబుల్ అరెస్ట్.. మద్యం మత్తులో ఘటన?

బస్సు చోరీ కేసులో.. కానిస్టేబుల్ అరెస్ట్.. మద్యం మత్తులో ఘటన?

August 1, 2026 | Andhra Pradesh

కదిరి ముచ్చట్లు:

కదిరి ఆర్టీసీ డిపో నుంచి చోరీకి గురైన బస్సు మదనపల్లెలో పట్టుబడిన కేసులో ఊహించని విషయం వెలుగుచూసింది. నిందితుడు అనంతపురానికి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ శివగా గుర్తించినట్లు సమాచారం. కుక్కతో కలిసి రైలులో కదిరికి వెళ్లిన అతడు బస్టాండ్ నుంచి బస్సును తీసుకెళ్లి మదనపల్లెలో రోడ్డుపై వదిలి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులోనే ఈ ఘటనకు పాల్పడినట్లు సమాచారం. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Tags: Constable arrested in bus theft case; incident occurred under the influence of alcohol?