August 1, 2026
Explore
ఒక్కసారిగ్గా పెరిగిన మిర్చి ధరలు

ఒక్కసారిగ్గా పెరిగిన మిర్చి ధరలు

August 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆసియాలోనే అతిపెద్దదైన గుంటూరు మార్కెట్ యార్డులో ఎండుమిర్చి ధరలు గణనీయంగా పుంజుకున్నాయి.గత 20 రోజుల్లో క్వింటాకు రూ.500 నుండి రూ.3,000 వరకు ధరలు పెరిగాయి. విదేశాల నుంచి డిమాండ్ పెరగడం, నాణ్యమైన సరుకు కొరత, ఎల్నినో ప్రభావం వంటి కారణాలతో ధరలు పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు తెలిపారు. తేజ, 334, సూపర్-10 రకాల మిర్చికి మంచి డిమాండ్ ఉంది. రానున్న రోజుల్లో వర్షాలు లేకపోతే సాగుపై ప్రభావం పడి, ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

Tags: Chilli prices have shot up suddenly.