విజయనగరం ముచ్చట్లు:
- విజయనగరం జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్
విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ లో 2021 సం.లో నమోదైన గంజాయి కేసులో సున్నంమెట్ట గ్రామం దుంబ్రిగూడ మండలం, ఎ.ఎస్.ఆర్.జిల్లాకు చెందిన నిందితుడు తామర్ల ధర్మ (26సం.లు) కు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10,000/- జరిమానా విధిస్తూ విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి కె. విజయ కళ్యాణి జూలై 31న తీర్పు వెల్లడించినట్టు జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ తెలిపారు.
విజయనగరం జిల్లా కొత్తవలస పోలీసు స్టేషన్ పరిధిలో తే. 06-08-2021 దిన ఒక వ్యక్తి ద్విచక్ర వాహనం పై గంజాయి రవాణా చేస్తున్నట్టు రాబడిన ఖచ్చితమైన సమాచారంతో కొత్తవలప జంక్షన్ వద్ద కొత్తవలస పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించగా ఎస్.కోట వైపు నుండి బైకుపై వస్తున్న వ్యక్తి పోలీసు వారిని చూసి పారిపోగా వెంటనే సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని బ్యాగు తనిఖీ చేసి 2.450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, అప్పటి అప్పటి కొత్తవలస సిఐ ఎస్.బాలసూర్యారావు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్టు చేసి రిమాండు తరలించి కోర్టులో అభియోగ పత్రం దాఖలు చేసారు. కోర్టు విచారణలో నిందితుడు తామర్ల ధర్మ (26 సం.లు) పై నేరారోపణలు రుజువు కావడంతో నిందితుడుకు విజయనగరం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ అండ్ సెషన్స్ జడ్జి శ్రీమతి కె. విజయ కళ్యాణి గారు ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష మరియు రూ. 10,000/- జరిమానావిధించారని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కేసులో పోలీసుల తరుపున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీమతి వై. రేవతి గారు వాదనలు వినిపించగా, కొత్తవలస పోలీసు స్టేషన్ ప్రస్తుత సిఐ టి.వి. విజయకుమార్, కోర్టు హెడ్ కానిస్టేబులు కె.అప్పలనాయుడు, సి.ఎం.ఎస్. కానిస్టేబులు కె.త్రినాధ రావు సాక్ష్యులను సకాలంలో హాజరపర్చి నిందితుడికి శిక్షింపబడే విధంగా వ్యహరించారని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్, ఐపిఎస్ తెలిపారు.ఈ కేసులో ముద్దాయిలకు శిక్ష పడే విధంగా వ్యవహరించిన పోలీసు అధికారులని, సిబ్బందిని మరియు ఎపిపి ని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ అభినందించారు.
Tags:Accused in marijuana case sentenced to one year in jail and fined.