August 1, 2026
Explore
ఏపీలో సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్ డేట్

ఏపీలో సర్పంచ్ ఎన్నికలపై బిగ్ అప్ డేట్

August 1, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

ఈ నెల 6న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మున్సిపల్, పంచాయతీరాజ్ శాఖ అధికారులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో వార్డుల విభజన, కోర్టు కేసుల స్థితి, ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు తదితర అంశాలపై సమీక్షించి అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.

ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ముందుగా మున్సిపల్ ఎన్నికలు, అనంతరం ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు, చివరగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం.

అన్ని ఎన్నికలను అక్టోబర్‌లోపు పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

Tags;Big update on Sarpanch elections in AP