August 1, 2026
Explore
కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత

కదిరిలో ఆర్టీసీ బస్సు చోరీ.. మదనపల్లిలో బస్సుతో సహా దొంగ పట్టివేత

August 1, 2026 | Andhra Pradesh

కదిరి ముచ్చట్లు:

సత్యసాయి జిల్లా కదిరి ఆర్టీసీ డిపోలో శనివారం అర్ధరాత్రి ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును చోరీ చేశాడు. బస్సును మదనపల్లి వైపు తీసుకెళ్తుండగా అప్రమత్తమైన ఆర్టీసీ అధికారులు అడ్డుకొని బస్సును స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కదిరి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

Tags:Kadiri RTC bus theft: Thief apprehended along with Madanapalle buses.