August 1, 2026
Explore
హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి: ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా

హెల్మెట్ ధరించండి.. ప్రాణాలను కాపాడుకోండి: ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా

August 1, 2026 | Andhra Pradesh

రాయచోటి ముచ్చట్లు:

రాయచోటి ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా సుండుపల్లి రోడ్డులో హెల్మెట్ వినియోగం, మైనర్ డ్రైవింగ్, ఇన్సూరెన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

హెల్మెట్ ధరించకపోవడం వల్ల రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం ఎక్కువగా జరుగుతోందని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులతో పాటు వాహన యజమానులపైనా చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రతి వాహనానికి ఇన్సూరెన్స్, అవసరమైన పత్రాలు తప్పనిసరిగా ఉండాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని కోరారు.

Tags:Wear a helmet… save your life: Traffic CI Chand Basha