గురంకొండ ముచ్చట్లు:
గురంకొండ మండలంలోని రామాపురానికి చెందిన తరిగొండ రఘునాథ్‌పై.. అదే గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు హత్యాప్రయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం వెలుగుచూసింది. ఎస్సై రవీంద్రబాబు కథనం మేరకు.. రఘునాథ్‌ను అదే గ్రామానికి చెందిన కావలి రామ్మోహన్, తంగెళ్ల శ్రీనివాసులు విందుకు పిలిచారు. ముగ్గురు గురంకొండకు వస్తూ మార్గ మధ్యలో విద్యుత్తు ఉపకేంద్రం దగ్గర మద్యం తీసుకుని సమీప పొదల్లోకి వెళ్లారు. అక్కడ రఘునాథ్‌పై దాడి చేసి గాయపరిచారు. వారి నుంచి అతడు తప్పించుకుని రహదారిపైకి వచ్చాడు. దీంతో నిందితులు పరారయ్యారు. తన భార్య సహకారంతో రామ్మోహన్, శ్రీనివాసులు తనపై హత్యాప్రయత్నానికి పాల్పడ్డారని రఘునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, బాధితుడిని వాల్మీకిపురం ఆసుపత్రికి తరలించామని ఎస్సై చెప్పారు.
Tags:Attempted murder after inviting to a feast