శ్రీకాకుళం ముచ్చట్లు:
కొత్తూరులోని టైప్-4 కేజీబీవీ వసతిగృహంలో శుక్రవారం విషాదం చోటు చేసుకుంది.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం బైపీసీ చదువుతున్న సవర పూజిత (16) అనే విద్యార్థిని వసతి గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఆమె స్వగ్రామం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం లక్కయ్యగూడ గ్రామం.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి కుటుంబ సభ్యులు విద్యార్థిని మృతిపై అనుమానాలు వ్యక్తం చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
Tags: Inter student commits suicide in hostel