చిత్తూరు ముచ్చట్లు:
ఆంధ్రప్రదేశ్ పోలీస్ ట్రాఫిక్ ఈ-చలానా పేరుతో కొన్ని నకిలీ APK ఫైళ్లు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సైబర్ నేరస్తులు కొత్త కొత్త మార్గాల్లో మోసాలకు పాల్పడుతున్న నేపథ్యంలో, ప్రజలు ఇలాంటి సైబర్ ఉచ్చుల్లో పడకుండా ముందస్తు హెచ్చరికగా ఈ సమాచారం తెలియజేయడమైనది. ప్రస్తుతం వైరల్ అవుతున్న “rto_challan.apk” వంటి ఫైళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయకండి. ఇలాంటి APK ఫైళ్లు ఓపెన్ చేయడం వల్ల మీ వ్యక్తిగత సమాచారం, బ్యాంకింగ్ వివరాలు దొంగిలించబడే అవకాశం ఉండటంతో పాటు, మీ డబ్బును కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. మీ వాహనంపై నిజంగా ఈ-చలాన్ ఉందా లేదా తెలుసుకోవాలనుకుంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న అధికారిక “మనమిత్ర” వాట్సాప్ ఈ-గవర్నెన్స్ సేవను మాత్రమే ఉపయోగించండి.
తెలుసుకునే విధానం:
• 9552300009 నంబర్‌ను మీ వాట్సాప్‌లో సేవ్ చేయండి
• ఆ నంబర్‌కు “Hi” అని మెసేజ్ పంపండి
• అందులో కనిపించే ఆప్షన్లలో “పౌర సేవ” (Citizen Services) ను ఎంచుకోండి
• తదుపరి “పోలీస్ సేవలు” (Police Services) ఎంపిక చేసుకోండి
• అందులో “ఈ-చలాన్ వివరాలు” (e-Challan Details) పై క్లిక్ చేయండి
• మీ వాహన నంబర్ నమోదు చేసి వివరాలు తెలుసుకోండి
ఒకవేళ మీ వాహనంపై చలాన్ ఉంటే, అదే ప్లాట్‌ఫామ్ ద్వారా PhonePe, Google Pay, UPI వంటి సురక్షిత చెల్లింపు విధానాల ద్వారా చెల్లించవచ్చు.
ఈ సేవ పూర్తిగా అధికారికమైనది మరియు సురక్షితమైనది.
కావున, ప్రజలందరూ పై పేర్కొన్న నకిలీ APK ఫైళ్లను ఓపెన్ చేయకుండా జాగ్రత్తగా ఉండి, మీ వ్యక్తిగత సమాచారం మరియు నగదును రక్షించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము.
Tags: An Appeal to the Public from the Chittoor Traffic Police