July 30, 2026
Explore
చెరువులో పడి ఇద్దరు వేద పాఠశాల విద్యార్థులు మృతి

చెరువులో పడి ఇద్దరు వేద పాఠశాల విద్యార్థులు మృతి

July 30, 2026 | Andhra Pradesh

పల్నాడు ముచ్చట్లు:

అమరావతి మండల పరిధిలోని ఎండ్రాయి గ్రామం లోని శ్రీ గీత వెంకటేశ్వర వేద పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు బుధవారం పాఠశాల ప్రక్కనే ఉన్న చెరువు లో పడి రాజమండ్రి కి చెందిన బమ్మిడి శివ (18), కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం వేములనర్వ గ్రామం కు చెందిన కొడవటి కంటి కిరణ్ (17) లు మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం వేద పాఠశాల పక్కన ఉన్న చెరువులోకి ఆవు వెళ్ళటంతో ఆవుతోపాటు చెరువులోకి వెళ్ళిన ముగ్గురు వేద విద్యార్థుల్లో ఒక విద్యార్థి బయటకు రాగా, చెరువులో పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం వారిని అమరావతి కమ్యూనిటీ వైద్యశాలకు తరలించారు.

Tags: Two Veda school students die after falling into a pond.