అమరావతిముచ్చట్లు:
ఏపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి మహిళల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ‘దీపం-2’ పథకానికి సంబంధించి కీలక ప్రకటన వెలువడింది. అర్హులైన లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 139.53 కోట్ల నిధులను విడుదల చేసింది.
ఆగస్టు-అక్టోబర్ నిధుల కేటాయింపు
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఈ నిధులతో ఆగస్టు నుంచి అక్టోబర్ త్రైమాసికానికి సంబంధించి అర్హులైన ప్రతి కుటుంబానికి ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్లు అధికారులు తెలిపారు. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, నిర్దేశిత సమయంలో సబ్సిడీ సొమ్మును నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో జమ అయ్యేలా పౌరసరఫరాల శాఖ తగిన ఏర్పాట్లు చేస్తోంది.
Tags:Rs 139.53 crore released for free gas cylinders.