దేవెగౌడ సతీమణి మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం
ఫోన్‌లో మాజీ ప్రధానితో మాట్లాడిన ముఖ్యమంత్రి
అమరావతి ముచ్చట్లు:
మాజీ ప్రధాని హెచ్.డి. దేవెగౌడ సతీమణి చెన్నమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆయన్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఫోనులో పరామర్శించారు. చెన్నమ్మ మృతి పట్ల సీఎం సంతాపం వ్యక్తం చేశారు. ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. చెన్నమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆమె కుటుంబ సభ్యులు ఈ విషాదాన్ని తట్టుకుని మనోధైర్యంతో ఉండాలన్నారు. ఈ సందర్భంగా దేవెగౌడ సహా ఆయన కుటుంబంతో మూడు దశాబ్దాలుగా తనకున్న అనుబంధాన్ని సీఎం చంద్రబాబు గుర్తు చేసుకున్నారు.
Tags: CM Chandrababu calls on former Prime Minister H.D. Deve Gowda.