July 29, 2026
Explore
నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో  వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి, భాజపా ఎంపీ కంగనా రనౌత్

July 29, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

కాక్రోచ్ జనతా పార్టీ (CJP) అధికార ప్రతినిధి సౌరవ్ దాస్పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అతడో పనికిరాని వ్యక్తి అని మండిపడ్డారు. అతడి వయసులో తాను రెండు జాతీయ అవార్డులు సాధించానని తెలిపారు. అసలేం జరిగిందంటే..

జెన్-జీ నిరసనకారులు గట్టర్ జనరేషన్ (మురికి కాలువ లాంటివారు) అంటూ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలకు సౌరవ్ దాస్ (CJP Saurav Das) స్పందించారు. “ఆమె వ్యాఖ్యలను సొంత పార్టీ వారే సీరియస్ గా తీసుకోరు. మేమెందుకు బాధపడాలి. ఆమె చెప్పే మాటలను జెన్-జీ, జెన్-ఆల్ఫా లాంటి యువ తరం పట్టించుకుంటుందని నేను అనుకోను. ఈ దేశానికి కంగన చేసిన దానికంటే.. యువతరమే ఎక్కువ చేసింది. హిమాచల్ ఎంపీగా తన నియోజకవర్గానికి వెళ్లిన ఆమె.. చిన్న పనికే ఇబ్బంది పడ్డారు. తాను చేయలేనని చెప్పారు. ఆమె ఎంత సీరియస్గా ఉంటారో దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు” అని విమర్శించారు. దీంతో సీజేపీ ప్రతినిధికి కంగన ఘాటుగా బదులిచ్చారు.
“ఈ వ్యక్తి (సౌరవ్ దాస్) కోసం నెట్టింట వెతికాను. 28 ఏళ్ల విద్యార్థి అని వచ్చింది. కానీ నాకు నమ్మకం లేదు. అవును.. నేను గత రెండేళ్లుగానే రాజకీయాల్లో ఉండొచ్చు.. కానీ 20 ఏళ్లుగా ప్రజాజీవితంలో కొనసాగుతున్నా. అతడి వయసులో నేను రెండు జాతీయ అవార్డులు సాధించా. నిజమే పార్లమెంట్ సభ్యురాలిగా నాకు పనిభారం ఎక్కువగా ఉందని అన్నాను. ఎందుకంటే నేను ఎంపీ మాత్రమే కాదు.. దర్శకురాలు, నటి, నిర్మాత, స్క్రీన్ రైటర్, వ్యాపారవేత్తగా ఎన్నో విధులు నిర్వర్తిస్తున్నా. కానీ, పనికిరాని, నిరుద్యోగి అయిన నీలాంటి వ్యక్తికి… ఏ వయసులోనైనా బిజీగా ఉండటం అనేది ఎప్పటికీ అర్థం కాదు. సౌరవ్.. నీది వ్యక్తిగత సమస్యే. నువ్వు విద్యార్థివి కాదు. ఇకనైనా కొన్ని నైపుణ్యాలు నేర్చుకో” అని కంగనా రనౌత్ మండిపడ్డారు.

Tags: Actress and BJP MP Kangana Ranaut made controversial remarks regarding the NEET paper leak issue.