July 29, 2026
Explore
భర్తను నెలవారీగా లీజుకు ఇచ్చిన భార్య..

భర్తను నెలవారీగా లీజుకు ఇచ్చిన భార్య..

July 29, 2026 | Andhra Pradesh

అక్రమ సంబంధం పెట్టుకున్న భర్తకు ఊహించని షాకిచ్చిన ఇల్లాలు

థాయిలాండ్‌ ముచ్చట్లు:

ఇల్లు అద్దెకు ఇవ్వడం విన్నాం.. కార్లు, బైకులు లీజుకు ఇవ్వడం చూశాం. కానీ, కట్టుకున్న భర్తను లీజుకు ఇచ్చిన భార్య గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రియురాలితో కలిసి ఉండాలనుకున్న భర్తకు కోపంతో కాకుండా.. ఊహించని ‘మాస్టర్ ప్లాన్’తో షాక్ ఇచ్చింది ఈ భార్య. నెలకు రూ. 85,000 కడితే నా భర్తను నీతోనే ఉంచుకో అని ఆ ప్రియురాలికే ఆఫర్ ఇచ్చింది. అంతర్జాతీయంగా నెటిజన్లను షాక్‌కు గురిచేస్తున్న ఈ వింత ఘటన పూర్తి వివరాలు మీకోసం…

థాయిలాండ్‌కు చెందిన ఖున్ క్వాంగ్ (31) అనే మహిళ, ఒక పోలీస్ అధికారిని పదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి 8 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. చాలా కాలం పాటు వీరి కాపురం ఎంతో సంతోషంగా సాగింది. ఇటీవల భర్త ప్రవర్తనలో మార్పు రావడం, రాత్రివేళల్లో ఆలస్యంగా ఇంటికి రావడం గమనించిన క్వాంగ్‌కు అనుమానం వచ్చింది. ఆరా తీయగా, ఒక అపరిచిత మహిళ సోషల్ మీడియాలో తన భర్తను నిరంతరం ఫాలో అవుతుండటం చూసింది. అసలు నిజం తెలుసుకోవడానికి ఆమె ఒక ప్రైవేట్ డిటెక్టివ్‌ను నియమించింది. విచారణలో తన భర్త మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని, ఆమెతో కలిసి ఒక అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్నట్లు డిటెక్టివ్ ఆధారాలతో సహా బయటపెట్టాడు.

ఇంటికొచ్చి బిగ్ షాక్ ఇచ్చిన భర్త
ఈ విషయం బయటపడిన వెంటనే ఆ భర్త ఇంటికి వచ్చి, భార్యకు ఊహించని షాక్ ఇచ్చాడు. నాకు ఈ సంసారం వద్దు.. ఇల్లు, కారు, అప్పులు అన్నీ నీకే ఇచ్చేస్తున్నా.. నేను ఆమెతోనే ఉంటా అంటూ కట్టుబట్టలతో వెళ్ళిపోయాడు. అయినా భార్య ఎలాగోలా సర్దిచెప్పి అతడిని ఇంటికి రప్పించింది.

భార్య వేసిన రివర్స్ మాస్టర్ ప్లాన్
ఒక రోజు రాత్రి ఆ భర్త నేను ఆమెను (ప్రియురాలిని) మర్చిపోలేకపోతున్నాను, ఆమె లేకుండా ఉండలేను అని భార్య ముందే ఆవేదన వ్యక్తం చేశాడు. దాంతో కోపగించుకోకుండా, భార్య క్వాంగ్ ఒక వింతైన ఆలోచన చేసింది. నీకు నా భర్త కావాలి, నా భర్తకు నువ్వు కావాలి. కాబట్టి నా భర్తను నీకు అద్దెకు (లీజుకు) ఇస్తాను. కానీ దానికి ప్రతిఫలంగా నెలకు 30,000 థాయ్ బాట్లు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.85,000) నాకు చెల్లించాలి. అప్పుడు అతడు నీతోనే ఉండవచ్చు. కానీ నేను చట్టపరంగా విడాకులు మాత్రం ఇవ్వను అని షరతు విధించింది.

ప్రియురాలు ఓకే.. భర్త నో!
ఈ ఆఫర్ విన్న ప్రియురాలు నాకు డబ్బు సమస్య కాదు, అద్దె కట్టడానికి నేను సిద్ధం అని తల ఊపింది. కానీ, తనను ఇలా లీజుకు ఇవ్వడం నచ్చక భర్త మాత్రం ఈ అగ్రిమెంట్‌కు నిరాకరించాడు.

చట్టం ఏమంటోంది?
ఈ వింత ‘హజ్బెండ్ లీజ్ అగ్రిమెంట్’ (భర్త అద్దె ఒప్పందం) వార్త థాయిలాండ్ టీవీ షోలు, సోషల్ మీడియాలో వైరల్ కావడంతో న్యాయ నిపుణులు స్పందించారు. థాయిలాండ్ చట్టాల ప్రకారం ఏకపత్నీవ్రత నిబంధనలు అమలులో ఉన్నందున, డబ్బులు తీసుకుని భర్తను మరొకరికి అద్దెకు ఇచ్చే ఒప్పందాలకు చట్టపరమైన చెల్లుబాటు ఉండదని స్పష్టం చేశారు. చివరికి ఆ భార్య (క్వాంగ్) లీజ్ ప్లాన్ వర్కవుట్ కాకపోవడంతో, తన భర్త ప్రియురాలిపై కోర్టులో కేసు నమోదు చేసింది.

Tags: Wife leases out her husband on a monthly basis…