తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి జిల్లా పుల్లంపేటలో టిడిపి యువ నాయకుడిని అంటూ రెచ్చిపోతున్న ఓ ఆకతాయికి నిన్న రాత్రి కొంతమంది దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. పుల్లంపేట మండలం చొప్పావారి పల్లి కొత్త ఇండ్ల వద్ద సోమవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల లోపల అతనికి దేహశుద్ధి చేసినట్లు తెలిసింది. పుల్లంపేట మండలంలో అతను టిడిపి నాయకుడిని అని అతని పర్మిషన్ లేకుండా చెరువులో మట్టి దగ్గర్నుంచి ఇసుక వరకు… అలాగే ప్రభుత్వ భూముల కబ్జా గురించి కూడా అతను అన్నింటికీ తానేనంటూ తన వెనుకల రాజకీయ పలుకుబడి ఉందని నియోజకవర్గ ఇన్చార్జ్ తో పాటు ఎమ్మెల్యే మనిషిని కూడా బహిరంగంగా చెప్పుకుంటూ గత కొంతకాలంగా రెచ్చిపోతున్నాడని మండల ప్రజలు చెబుతున్నారు. అయితే ఈ దురహంకారంతో దారిన పోయే ఆడపిల్లలను సైతం కామెంట్ చేయడం అతనికి పరిపాటిగా మారిందని మరికొంతమంది చెబుతున్నారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మహిళ టీచర్లపై కూడా అతను అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా వాట్సాప్ లో కూడా అసభ్యంగా మెసేజ్లు పెడుతున్నాడని మరి కొంతమంది చెబుతున్నారు. అయితే అధికార పార్టీ నాయకుడిని పోలీసులు, రెవెన్యూ అధికారులు, మండలంలో పనిచేసే అన్ని శాఖలకు సంబంధించిన వారు ఎవరైనా సరే తన కనుసనల్లోనే పనిచేయాలని బెదిరించినట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఏమైనాప్పటికీ నాయకుడంటే సభ్య సమాజంలో మహిళల పట్ల అపారమైన గౌరవం, సమాజంలో పార్టీకి పటిష్టమైన పేరు, పదిమంది యువతకు రోల్ మోడల్ గా నిలవాలి… కానీ ఇలాంటి చిల్లర చేష్టలు చేసి అటు పార్టీకి.. సభ్య సమాజం తలదించుకునే పనులు చేస్తూ ఇలా దేహశుద్ధి చేయించుకోవడం ఆ మండలంలో సర్వత్ర చర్చనీయాంశమైంది.. ఇంతకీ దేహశుద్ధి ఎందుకు జరిగింది..? దేహశుద్ధి చేసింది ఎవరు..? ఏంటి అనేదానిపై పూర్తి సమాచారం తెలియ రావాల్సి ఉంది.
Tags: TDP youth leader gets a thrashing…?!