నంద్యాల ముచ్చట్లు:
నంద్యాల జిల్లా ఆత్మకూరు మునిసిపల్ ఉద్యోగులు సైబర్ నేరగాల్ల వలలో చిక్కుకున్నారు. ఏసీబీ డీఎస్పీ నంటూ ఆత్మకూరు మున్సిపల్ మేనేజర్ మోహన్ నాయక్ తోపాటు మరో 4 ఉద్యోగులకు ఫోన్ చేసి తమ అవినీతి, అక్రమాలు బయటికి రాకూడదంటే రూ.3 లక్షలు పంపాలని నకిలీ డీఎస్పి డిమాండ్ చేశారు. దీంతో మొదటి విడతగా రూ.95,000ఫోన్ పే చేశారు. ఒకేసారి 5 మందికి ఫోన్ కాల్స్ రావడంతో మోసపోయామని గ్రహించి స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు చెబుతున్నారు.
Tags; Municipal employees fall prey to cybercriminals.