రాయచోటి ముచ్చట్లు:
దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్వహించిన ఇంటర్ సర్కిల్ క్రీడల్లో షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో రన్నరప్‌గా నిలిచిన అన్నమయ్య సర్కిల్ రాయచోటి డివిజన్‌కు చెందిన సీనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షరీఫ్‌ను డివిజనల్ ఇంజనీర్ ఎన్.ఎల్.డి. లివింగ్ స్టోన్ ఉద్యోగులు, కార్మికులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల్లో మరింత ప్రతిభ కనబర్చి సంస్థకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. టెన్నిస్ విభాగంలో లివింగ్ స్టోన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగముని స్వామి క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకున్నారని, భవిష్యత్తులో మరింత మంది ఉద్యోగులు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహిస్తామని తెలిపారు.
Tags: Runner-up in Inter-Circle Shuttle Badminton: Grand Felicitation for Mohammed Sharif