ఆంధ్రప్రదేశ్ ముచ్చట్లు:
గ్యాస్ కనెక్షన్ ఉన్న వినియోగదారులు తప్పనిసరిగా ఈ-కేవైసీ పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ సంస్థలు సూచిస్తున్నాయి. ఈ-కేవైసీ చేయించని వారి గ్యాస్ సిలిండర్ బుకింగ్ లు తాత్కాలికంగా నిలిపివేయబడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి. అలాగే గ్యాస్ సబ్సిడీ జమ కావడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు. గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆధార్ కార్డుతో సమీప గ్యాస్ ఏజెన్సీకి వెళ్లి బయోమెట్రిక్ ధృవీకరణ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు. వృద్ధులు లేదా వేలిముద్రలు నమోదు కాని వారు ఆధార్ కేంద్రంలో ఐరిస్ ధృవీకరణ ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు.
Tags: Haven’t completed e-KYC? Then your gas cylinder supply will be cut off.