జిల్లా జడ్జి అరుణసారిక
పుంగనూరుముచ్చట్లు:
న్యాయవాదుల సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉమ్మడి జిల్లాల ప్రధాన న్యాయమూర్తి అరుణసారిక తెలిపారు. శనివారం ఆమె పుంగనూరుకు చేరుకున్నారు. సీనియర్ సివిల్ జడ్జి ఆరిఫాషేక్, సిబ్బంది, న్యాయవాదులు ఆమెకు స్వాగతం పలికారు. ఆమె సీనియర్ సివిల్‌జడ్జి కోర్టును, రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ భవనంలో న్యాయవాదులతో సమావేశమైయ్యారు. సంఘ అధ్యక్షుడు చెన్నకేశవులు పలు సమస్యలపై జిల్లా జడ్జికి వినతిపత్రం సమర్పించారు. జిల్లా జడ్జి మాట్లాడుతూ న్యాయమూర్తుల బదిలీలు త్వరలోనే జరుగుతుందని, వెంటనే న్యాయమూర్తులు, సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయమై హైకోర్టుకు వినతిపత్రం పంపినట్లు ఆమె తెలిపారు. త్వరలోనే సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో ఏజిపి సురేష్‌బాబు, న్యాయవాదులు వీరమోహన్‌రెడ్డి, వెంకట్రామయ్యశెట్టి, బాలాజికుమార్, శివప్పనాయుడు, పులిరామకృష్ణారెడ్డి, ఎల్‌వి.రమణ, కిషోర్, నూరి తదితరులు పాల్గొన్నారు.
Tags: Steps to resolve lawyers’ problems