మదనపల్లె ముచ్చట్లు:
మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో ప్రగడ కోటయ్య 111వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, డీఆర్ఓ వెంకటేశు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. చేనేత కార్మికుల సంక్షేమం, సహకార సంఘాల బలోపేతం, మార్కెటింగ్ అవకాశాల కల్పనలో ప్రగడ కోటయ్య చేసిన సేవలు చిరస్మరణీయమని జేసీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా చేనేత రంగానికి విశేష సేవలందించిన సీనియర్ కార్మికులను శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు.
Tags: Pragada Kotaiah’s services for the welfare of handloom weavers are unforgettable: JC