రాయచోటి ముచ్చట్లు:
రాయచోటిలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం (APUS) అన్నమయ్య జిల్లా ముఖ్య కార్యకర్తల సమావేశంలో 2026 టెట్ లాంగ్వేజ్–1 తెలుగు మెటీరియల్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారు. హిందూ ధర్మం, సంస్కృతి, ఇతిహాసాలకు సంబంధించిన అంశాలను కించపరిచే పేరాగ్రాఫ్‌లను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. మెటీరియల్ రూపకల్పనలో బాధ్యులపై చర్యలు తీసుకుని, నిపుణుల కమిటీతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వాన్ని కోరారు. భవిష్యత్తులో ఇటువంటి అంశాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని, లేకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
Tags: Objectionable content in TET material must be removed: APUS