July 25, 2026
Explore
టీడీపీ జాతీయ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నంతో నిరసన..!

టీడీపీ జాతీయ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ఆత్మహత్యాయత్నంతో నిరసన..!

July 25, 2026 | Andhra Pradesh

మంగళగిరి ముచ్చట్లు:

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నుంచి వచ్చిన జె.గౌతమి కుటుంబం తమను ఆదుకోవాలని కోరుతూ ఆందోళన చేపట్టింది.

కదిరిలోని తమ ఇంటి ముందు కంచె వేసి, ఇల్లు ఖాళీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని గౌతమి ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా, ఆమె భర్త హోర్డింగ్ పైకి ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానంటూ నిరసన వ్యక్తం చేశారు.

కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని తమకు న్యాయం చేసి, ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags: A family attempts suicide in protest outside the TDP national office!