July 25, 2026
Explore
ఏపీలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు!.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

ఏపీలో 44.71 లక్షల ఓట్ల తొలగింపు!.. మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి!

July 25, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:


ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక చర్యలు చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 44.71 లక్షల ఓట్లను తొలగింపు జాబితాలో చేర్చింది. చిరునామా మార్పులు, మరణాలు, డబుల్ ఎంట్రీలు, ఓటర్ల వివరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జులై 31న విడుదలయ్యే ముసాయిదా ఓటర్ల జాబితాలో ఈ పేర్లు ఉండకపోవచ్చు. మీ పేరు లేకుంటే ఆగస్టు 30లోపు ఫారమ్-6 ద్వారా దరఖాస్తు చేసుకుని ఓటు హక్కును పునరుద్ధరించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు.

Tags: 44.71 lakh votes deleted in AP! Check if your name is on the list!