July 24, 2026
Explore
17 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన సీఐ రమేష్

17 మొబైల్ ఫోన్ల రికవరీ.. బాధితులకు అందజేసిన సీఐ రమేష్

July 24, 2026 | Andhra Pradesh

చిలకలూరిపేట ముచ్చట్లు:

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి రికవరీ చేసి బాధితులకు అందజేసిన సంఘటన చిలకలూరిపేట పట్టణ పోలీస్ స్టేషన్ లో చోటు చేసుకుంది. చిలకలూరిపేట అర్బన్ సీఐ రమేష్ ఆధ్వర్యంలో సుమారు 17 మంది బాధితులకు వారి మొబైల్ ఫోన్లను అప్పగించారు. బాధితుల సమక్షంలోనే ఈ ఫోన్లను వారికి అందించడం జరిగింది.
ఈ సందర్భంగా సీఐ రమేష్ మాట్లాడుతూ CEIR పోర్టల్ ద్వారా టెక్నాలజీని ఉపయోగించి ఈ మొబైల్స్ ను ట్రేస్ చేసి రికవరీ చేసినట్లు తెలిపారు. ప్రజలు తమ మొబైల్ ఫోన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే జేబు దొంగలు (పిక్ పాకెటర్స్) సులువుగా ఫోన్లను అపహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత సహాయంతో ఫోన్లను రికవరీ చేస్తున్నప్పటికీ, సెల్ ఫోన్ దొంగతనాలు తరచుగా జరుగుతూనే ఉన్నాయని తెలిపారు.ప్రతి ఒక్కరూ తమ గ్యాడ్జెట్స్ విషయంలో తగిన జాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. అలాగే, తమ చుట్టుపక్కల ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే ‘మనకెందుకులే’ అని వదిలేయకుండా, సామాజిక బాధ్యతగా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సీఐ రమేష్ ప్రజలను కోరారు.

Tags: 17 mobile phones recovered; CI Ramesh hands them over to the victims.