September 7, 2026
Explore
స్థానిక సమరానికి టీడీపీ సై: 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం

స్థానిక సమరానికి టీడీపీ సై: 28 జిల్లాలకు ఇన్‌ఛార్జ్‌లను ప్రకటించిన అధిష్ఠానం

September 7, 2026 | Andhra Pradesh

అమరావతిముచ్చట్లు:

అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకు బదులు సీనియర్లకు అప్పగింత

మిత్రపక్షాలతో సమన్వయం, ప్రచారంపై ఇన్‌ఛార్జ్‌లకు కీలక బాధ్యతలు

ఫలితాల్లో తేడా వస్తే ఒప్పుకోనని కుప్పం నేతలకు సీఎం చంద్రబాబు హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీ (టీడీపీ) సర్వసన్నద్ధమవుతోంది. ఈ దిశగా ఎన్నికల కసరత్తును వేగవంతం చేస్తూ, రాష్ట్రంలోని 28 జిల్లాలకు పార్టీ ఇన్‌ఛార్జ్‌లను నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీ చేసింది. అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో ఈసారి సరికొత్త వ్యూహాన్ని అనుసరించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

జిల్లాలవారీ ఇన్‌ఛార్జ్‌‌లు
శివ శంకర్. చలువాది


జిల్లాఇన్‌ఛార్జ్
పార్వతీపురం మన్యందాడి రత్నాకర్
అల్లూరి సీతారామరాజుపేరాబత్తుల రాజశేఖర్
శ్రీకాకుళంఎండీ నజీర్
విజయనగరంఎంపీ చింతకాయల విజయ్
విశాఖపట్నంఎంఏ షరీఫ్
అనకాపల్లికొండపల్లి అప్పలనాయుడు
పోలవరంకె సత్తిబాబు
కాకినాడసుజయ్ కృష్ణరంగారావు
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమఎంపీ సానా సతీష్
తూర్పుగోదావరిదేవినేని ఉమామహేశ్వరరావు
పశ్చిమగోదావరిఎంపీ భాష్యం రామకృష్ణ
ఏలూరుఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ
కృష్ణాకొమ్మాలపాటి శ్రీధర్
ఎన్టీఆర్మక్కెన మల్లికార్జునరావు
గుంటూరుఎంవీ సత్యనారాయణరాజు
పల్నాడుకొనకళ్ల నారాయణ
బాపట్లజంగా కృష్ణమూర్తి
ప్రకాశంఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి
మార్కాపురంఎమ్మెల్సీ బీటీ నాయుడు
నెల్లూరుఎస్‌వీఎస్‌ఎన్ వర్మ
తిరుపతినూకసాని బాలాజీ
చిత్తూరుదామచర్ల సత్య
కడపదీపక్ రెడ్డి
అన్నమయ్యఎమ్మెల్సీ శ్రీకాంత్
అనంతపురంఏరాసు ప్రతాప్‌రెడ్డి
శ్రీసత్యసాయిసోమిశెట్టి వెంకంటేశ్వర్లు
కర్నూలుపెళ్లకూరు శ్రీనివాసరెడ్డి
నంద్యాలవైకుంఠం ప్రభాకర్ చౌదరి

Tags: TDP Gears Up for Local Polls: Party Leadership Announces In-charges for 28 Districts