July 24, 2026
Explore
జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..!!

జనగామలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి..!!

July 24, 2026 | Andhra Pradesh

జనగామ ముచ్చట్లు:

జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. బమ్మెర శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీని వేగంగా వచ్చిన బైక్ ఢీకొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.

మృతులను నర్సింగపురం తండాకు చెందిన కేతావత్ నరేందర్, బాదావత్ తిరుపతిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు చేపట్టారు. అప్పటికే ఇద్దరు యువకులు మృతి చెందినట్లుగా స్థానికులు తెలిపారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ప్రమాదానికి గల కారణాలపై వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటన ఎలా జరిగింది? అనే అంశాలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.

Tags: Road accident in Jangaon… Two dead…!!