రాజంపేట ముచ్చట్లు:
రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి చమర్తి జగన్మోహన్ రాజు ఆధ్వర్యంలో వీరబల్లి మండలం గుర్రప్పగారిపల్లె, తొగటపల్లెలకు చెందిన వైసీపీకి చెందిన 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరాయి. వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన చమర్తి, కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై విశ్వాసంతోనే ప్రజలు టీడీపీలో చేరుతున్నారని అన్నారు.
మండలంలోని అన్ని గ్రామాలకు రోళ్లమడుగు ద్వారా తాగునీరు అందించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. జల్ జీవన్ మిషన్ కింద రూ.27 కోట్లతో తాగునీటి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
Tags: 25 families joined the TDP under Chamarthi’s leadership.