July 24, 2026
Explore
లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటపై దాడి.. తాళిబొట్టు తెంచిన కుటుంబ సభ్యులు

లవ్ మ్యారేజ్ చేసుకున్న జంటపై దాడి.. తాళిబొట్టు తెంచిన కుటుంబ సభ్యులు

July 24, 2026 | Andhra Pradesh

సుండుపల్లి ముచ్చట్లు:

సుండుపల్లి మండలానికి చెందిన శివస్నేహ, తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మండలం మతిమూడి గ్రామానికి చెందిన యువకుడు ప్రేమించి జూలై 19న ఆలయంలో వివాహం చేసుకున్నారు.

రక్షణ కోసం ఎస్పీ కార్యాలయానికి వెళ్తుండగా తిరుపతిలోని ఎస్వీయూ సమీపంలో ఇరువురి కుటుంబ సభ్యులు వారిపై దాడి చేసినట్లు సమాచారం. ఈ ఘటనలో యువతి మెడలోని తాళిబొట్టును తెంచినట్లు తెలిసింది. స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని కొత్త దంపతులను ఎస్వీయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Couple who had a love marriage attacked; family members tore off the thali (sacred wedding pendant).