July 24, 2026
Explore
అన్నమయ్య జిల్లాలో రాత్రి పోలీసుల ప్రత్యేక నిఘా

అన్నమయ్య జిల్లాలో రాత్రి పోలీసుల ప్రత్యేక నిఘా

July 24, 2026 | Andhra Pradesh

అన్నమయ్య జిల్లా ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ప్రతి రాత్రి పోలీసులు ప్రత్యేక గస్తీ, నిఘాను ముమ్మరం చేశారు. నేరాల నివారణ, రోడ్డు భద్రత కోసం వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలతో పాటు వాహనదారులు సురక్షితంగా గమ్యస్థానాలకు చేరేందుకు “పేస్ వాష్ అండ్ గో” కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

రాత్రివేళల్లో సంచరించే అనుమానితుల వేలిముద్రలు సేకరిస్తూ, సరిహద్దులు, ఏటీఎంలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వస్తువులు కనిపిస్తే వెంటనే డయల్-100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని పోలీసులు ప్రజలను కోరారు.

Tags; Special police surveillance at night in Annamayya district