July 24, 2026
Explore
తల్లికి వందనం డబ్బుల వివాదం.. మహిళ దారుణ హత్య

తల్లికి వందనం డబ్బుల వివాదం.. మహిళ దారుణ హత్య

July 24, 2026 | Andhra Pradesh

పెద్దతిప్పసముద్రం ముచ్చట్లు:

అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం (పీటీఎం) మండలం రాపూరివారిపల్లి పంచాయతీ కొత్తపల్లి సమీపంలో పద్మావతి అనే మహిళ దారుణ హత్యకు గురైంది. తల్లికి వందనం పథకం డబ్బుల విషయంలో జరిగిన వివాదమే హత్యకు కారణమని మృతురాలి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

డబ్బులు ఇవ్వలేదనే కారణంతో భర్త సురేష్ చిత్రహింసలకు గురిచేసి గొంతుకోసి హత్య చేశాడని మృతురాలి తల్లి కళావతి ఆవేదన వ్యక్తం చేశారు. మృతురాలికి ప్రణీత్ (5వ తరగతి), విష్ణు (3వ తరగతి) అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై పెద్దతిప్పసముద్రం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags: Dispute over ‘Thalliki Vandanam’ funds: Woman brutally murdered.