July 22, 2026
Explore
జార్డండ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణ..

జార్డండ్ నుంచి హైదరాబాద్‌కు గంజాయి రవాణ..

July 22, 2026 | Andhra Pradesh

జార్డండ్ ముచ్చట్లు:

14 కేజీల గంజాయితో పట్టుబడిన నిందితుడు..

ఒరిస్సా బరంపూర్ నుంచి గంజాయిని తీసుక వచ్చి హైదరాబాద్‌లో డెలీవరి చేస్తున్న క్రమంలో సైబరాబాద్ ఎన్‌ఫోర్స్‌మెంట్ సీఐ చంద్రశేఖర్ సిబ్బంది కలిసి 14 కేజీల గంజాయిని పట్టుకున్నారు.

నకుల్ యాదవ్ (27) అనే వ్యక్తి ఒరిస్సా నుంచి తీసుక వచ్చిన గంజాయిని షెర్‌లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో గంజాయి తీసుకునే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న సమయంలో నిందితుడిని పట్టుకున్నారు.

ఆతడి వద్ద ఉన్న 14 గంజాయిని, రూ.2890 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పట్టుకున్న గంజాయి విలువ రూ.7 లక్షలుగా ఉంటుందని, నిందితుడిని గంజాయిని షేర్ లింగంపల్లి ఎక్సైజ్ స్టేషన్‌లో అప్పగించినట్లు అసిస్టెంట్ కమిషనర్ జి.శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Tags: Ganja (cannabis) being transported from Jharkhand to Hyderabad…