విజయనగరం ముచ్చట్లు:
విజయనగరం జిల్లా గరివిడి మండలం కొండశంభాం గ్రామానికి చెందిన వివాహిత పిల్లా శ్రీలక్ష్మి పురుగుల మందు.తాగి ఆత్మహత్య చేసుకుంది. శ్రీలక్ష్మికి, పిల్లా సాయితో ఈ నెల 2న వివాహం జరిగింది. శ్రీలక్ష్మి గతంలో హైదరాబాద్ లో ఉద్యోగం చేసేది. అప్పుడు వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉండేదన్న విషయం పిల్లా సాయికి తెలిసింది. దాంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. ఆ విషయాన్ని శ్రీలక్ష్మి తండ్రికి పిల్లా సాయి చెప్పాడు. దాంతో మనస్థాపానికి గురైన శ్రీలక్ష్మి ఈ నెల 17న పురుగుల మందు తాగింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.
Tags: Married woman commits suicide by consuming pesticide.