శంషాబాద్ ముచ్చట్లు:
శంషాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రాళ్లగూడ ఇంద్రనగర్ రాజీవ్ గృహ సమీపంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ నవజాత శిశువును సంచిలో పెట్టి రోడ్డుపై అనాథలా వదిలేసి వెళ్లిపోయారు. పాప ఏడుపు విన్న స్థానికులు వెంటనే అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించడంతో శిశువు ప్రాణాపాయం నుంచి బయటపడింది. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పసికందును రక్షించి వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా శిశువును వదిలేసిన వారిని గుర్తించే పనిలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టారు.
Tags: Heartless people abandoned an infant in a bag on the road!