పల్నాడు ముచ్చట్లు:
1,76,583 మంది తల్లులకు లబ్ధి..
రాష్ట్ర ప్రభుత్వం అత్యంతప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘తల్లికి వందనం’ పథకం కింద ఆర్థిక సహాయం విడుదల చేసేందుకు సర్వం సిద్ధమైంది. విద్యార్థుల చదువులకు భరోసానిస్తూ, తల్లుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసే ఈ కార్యక్రమం నేడు రాష్ట్రవ్యాప్తంగా అట్టహాసంగా ప్రారంభం కానుంది. ఈనేపథ్యంలో పల్నాడు జిల్లాలోనూ లబ్ధిదారులైన తల్లుల ఖాతాల్లోకి నిధులు జమ కానున్నాయి.
జిల్లాలో లబ్ధిదారుల వివరాలు..
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం అర్హత సాధించిన విద్యార్థులకు ఒక్కొక్కరికి ₹13,000 చొప్పున ఆర్థికసహాయం అందనుంది.పల్నాడు జిల్లా వ్యాప్తంగా అందిన దరఖాస్తులు మరియు సమగ్ర సర్వే ఆధారంగా అధికారిక గణాంకాలను అధికారులు విడుదల చేశారు:
మొత్తం విద్యార్థుల సంఖ్య: 2,83,084
లబ్ధి పొందుతున్న తల్లుల సంఖ్య: 1,76,583
నిధుల విడుదలపై సర్వత్రా హర్షం..
పాఠశాల విద్యను అభ్యసించే విద్యార్థుల తల్లులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. నేడు నిధులువిడుదలవుతుండటంతో జిల్లాలోని లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తల్లుల ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ కానుండటంతో ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని అధికార వర్గాలు వెల్లడించాయి.
ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది.నిధుల జమపై ఏవైనా సందేహాలు ఉంటే స్థానిక సచివాలయాలు లేదా విద్యాశాఖఅధికారులను సంప్రదించాలని సూచించారు.
Tags: ‘Talliki Vandanam’ in Palnadu district today… funds to be credited…