-10,11న రెండు రోజులు కోలాహలం
- విందువినోదాలతో జనం
పుంగనూరుముచ్చట్లు:
శ్రీసుగుటూరు గంగమ్మ జాతర ఈనెల 10, 11 తేదీలు మంగళ, బుధవారాలలో ఘనంగా నిర్వహించనున్నారు. ప్రతియేటా జాతరకు మాజి మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సతీమణి స్వర్ణమ్మ, ఎంపి మిధున్‌రెడ్డి కలసి అమ్మవారికి పట్టువలు సమర్పించి, పూజలు చేస్తారు. జాతర కోసం బంధుమిత్రులు పట్టణానికి చేరుకుంటున్నారు. జనం ఏర్పాట్లలో నిమగ్నమైయ్యారు. పట్టణ ప్రజలు ఇండ్లకు వెల్లవేసి, మామిడి ఆకు, వేపాకు తోరణాలతో ఇండ్లను శుద్దిచేసి అలంకరిస్తున్నారు. గంగమ్మకు వెహోక్కులు చెల్లించేందుకు పురుషులు ల వేషధారణలో గెరిగెలు తీసుకొచ్చి అమ్మవారికి వెహోక్కులు చెల్లించడం ఆనవాయితీ. జాతర సందర్భంగా పట్టణంలో రంగులరాట్నాలు, దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. జాతరలో విందుభోజనాలతో కాలక్షేపం చేయనున్నారు.
శ్రీ సుగుటూరు గంగమ్మ చరిత్ర ….
జిల్లా చరిత్రలో పుంగనూరు జమీందారులు సుగుటూరు వంశస్తులు. వీరు కీలకపాత్ర పోషించారు. పుంగనూరు జమీందారి పాలన పలమనేరు , సదుం, మదనపల్లె వరకు సాగింది. తొలి సారిగా క్రీ.శ.600 సంవత్సరాల నుంచి జమీందారి పాలన ఇటు కర్నాటక, గుర్రంకొండ వరకు సుగుటూరు వంశస్తులు సుమారు 700 గ్రామాలను తమ పరిధిలో ఉంచుకుని పరిపాలన సాగించారు. సుగుటూరు వంశస్తులైన రణబైరేగౌడు అనే వ్యక్తి తొలి సారిగా కర్నాటకలో ఉన్న సుగుటూరు ప్రాంతాన్ని పాలించేవారు. అక్కడి నుంచి పుంగనూరులో వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అప్పటి నుంచి ప్రతి యేటా జమీందారుల కులదైవమైన సుగుటూరు గంగమ్మ జాతర జమీందారిల సాంప్రదాయ రీతిలో మార్చి, ఏప్రిల్ నెలల్లో నిర్వహిస్తారు.
జాతర నాలుగుసార్లు జరగలేదు….
కర్నాటకలోని జంగమకోట సుగుటూరులో ప్రారంభమైన సుగుటూరు గంగమ్మజాతర అక్కడ 75 సంవత్సరాలు నిర్వహించారు. అనంతరం బైల్ సుగుటూరులో 150 సంవత్సరాలు, పుంగనూరులో 563 సార్లు జాతర నిర్వహించారు. ఇప్పటికి 789 సార్లు జాతర జరిగిన ట్లు చరిత్ర చెబుతోంది. టిప్పు సుల్తాన్ వారి పాలనలో రెండు సార్లు, జాతర సమయంలో ఒక జమీందారు యుద్దంలో చనిపోవడం, మరోకసారి పుంగనూరులో ప్లేగు వ్యాదిరావడంతో జాతర ఆపివేసినట్లు తెలుస్తోంది.



Tags: Sri Sugutur Gangamma