కడప ముచ్చట్లు:
కడప జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయే ఘటన వెలుగులోకి వచ్చింది. చికిత్స పొందుతూ మృతి చెందిన మహిళ మృతదేహం చేతికి ఉన్న బంగారు గాజును అంబులెన్స్ డ్రైవర్ దొంగిలించిన ఘటనలో పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
రాయచోటి మండలం గొర్లముదివీడు గ్రామానికి చెందిన దుగ్గనపల్లె చాంద్‌బాషా తన తల్లి హుసేన్బీని చికిత్స కోసం కడపకు తీసుకెళ్లాడు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందడంతో మృతదేహాన్ని అంబులెన్స్‌లో స్వగ్రామానికి తరలిస్తున్న సమయంలో డ్రైవర్ గంగాధర్ నాయుడు ఆమె చేతికి ఉన్న బంగారు గాజును అపహరించాడు.
ఈ ఘటనపై చాంద్‌బాషా కడప తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు గంగాధర్ నాయుడిని అరెస్టు చేసి, దొంగిలించిన బంగారు గాజును స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Tags: Theft of gold bangle from corpse’s wrist… Ambulance driver arrested.