July 22, 2026
Explore
వాహనం ఢీకొని మృతి చెందిన జింకకు దహనక్రియలు

వాహనం ఢీకొని మృతి చెందిన జింకకు దహనక్రియలు

July 22, 2026 | Andhra Pradesh

ములకలచెరువు ముచ్చట్లు:

ములకలచెరువు మండలంలోని కనుగొండరాయస్వామి ఆలయానికి వెళ్లే రహదారి సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మృతి చెందిన జింకకు అటవీశాఖ అధికారులు మంగళవారం దహనక్రియలు నిర్వహించారు. ఎఫ్‌బీఓ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పశువైద్య సిబ్బంది పోస్టుమార్టం అనంతరం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అంత్యక్రియలు చేపట్టారు. అడవి జంతువుల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు పేర్కొంటూ, అటవీ ప్రాంతాల్లో వాహనదారులు వేగ నియంత్రణ పాటించాలని సూచించారు. అలాగే హనుమాన్ టీం వాలంటీర్లను నియమిస్తే ఇలాంటి ఘటనలను నివారించవచ్చని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Tags: Cremation performed for deer killed in vehicle collision